EX- Minister Devineni Fires On Cm Jagan :ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పరిశీలించారు. గొల్లపూడిలో పార్టీ నేతలతో కలిసి మిగ్‌జాం తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని దేవినేని ఉమా ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యలు లేకనే రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని విమర్శించారు. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతోనే పొలాల్లోకి మురికి నీరు చేరిందన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ ఇంకా ప్రజల వద్దకు రాలేదని మండిపడ్డారు. తాడేపల్లిలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతు, రైతు కూలీ, కౌలు రైతుల కష్టాలు కనపడవని దుయ్యబట్టారు. ప్రభుత్వ మద్దతు ధర ఇచ్చి తడిసిన ధాన్యం కొనాల్సిందేనని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం - మరో 3 నెలల్లో ఇక్కడా చూస్తాం: చంద్రబాబు
TDP Leders On YCP Government :జగన్ లాంటి కనీస మానవత్వం లేని ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడలేదని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మిగ్‌జాం తుపాను ధాటికి 22 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగితే జగన్ స్పందిస్తున్న తీరే అందుకు నిదర్శనమన్నారు. మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతులు పూర్తిగా నష్టపోయారని వారిని తక్షణం ఆదుకోవడం ఈ ప్రభుత్వం బాధ్యత కాదా అని ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం, కొండవీడులో తుపాను కారణంగా దెబ్బతిన్న అరటి, దొండ తోటలను ప్రత్తిపాటి టీడీపీ, జనసేన పార్టీల నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యడ్లపాడు మండలం కొత్తపాలెం, కొండవీడు, కోట, సొలస, లింగారావుపాలెం, మైదవోలులో పంటలు బాగా దెబ్బతిన్నాయని అన్నారు. కొత్తపాలెంలో అరటితోటకు ఎకరానికి రూ.లక్షన్నర వరకు పెట్టబడి పెట్టారనీ, తుపాను గాలులకు పూర్తిగా అవి నేలకొరిగాయని చెప్పారు. పెట్టిన పెట్టుబడిలో రైతుకు ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చే పరస్థితి లేదన్నారు. మిరప, పత్తి, అరటి, దొండ, కరివేకాకు తోటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పత్తి మూడో విడత ఏరివేతకు వచ్చిన దశలో పూర్తిగా నష్టపోయిందన్నారు.