ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో ఘనంగా గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు - విజయవాడలో క్రీడలు

Gurukul Schools National Games 2022 : విజయవాడలో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు నిర్వహించునున్నారు. దేశ వ్యాప్తంగా 22 రాష్టాల క్రీడకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు.

National Games-2022
జాతీయ క్రీడలు-2022

By

Published : Dec 18, 2022, 10:01 AM IST

Gurukul Schools National Games : ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు-2022 కార్యక్రమం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి రేణుకా సింగ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి రాజన్నదొర, అరకు ఎంపీ మాదవి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నృత్యాలు, వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నెల 22 వరకు జాతీయ క్రీడలు జరగనున్నాయి. ఏపీలో ఈ క్రీడలు నిర్వహిడం చాలా ఆనందంగా ఉందని.. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర అన్నారు.

విజయవాడలో ఘనంగా గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు

"ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు-2022 మన రాష్ట్రంలో నిర్వహించడం చాలా గొప్పగా భావిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఐదు క్రీడా పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కర్నూలు, అనంతపురంలో స్థాపిస్తున్నాం. అక్కడ గిరిజన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తారు." - రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details