CM Jagan Going To HYD: సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఇప్పటికే సీఎం జగన్ సంతాపం తెలిపారు. అయితే కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించటానికి సీఎం బుధవారం హైదరాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 11.20 గంటలకు పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుంటారు. అక్కడ సూపర్‌స్టార్ కృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి.. 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్.. కృష్ణ పార్థివదేహానికి నివాళులు - Super Star
CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయనికి నివాళులు అర్పించనున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
కృష్ణను తెలుగువారి సూపర్‌స్టార్‌గా, అల్లూరిగా, జేమ్స్‌బాండ్‌గా కొనియాడారు. సినీరంగంలో ప్రత్యేకతతో పాటు నిజజీవితంలోనూ కృష్ణను మనసున్న మనిషిగా జగన్ అభివర్ణించారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటని సీఎం ట్వీట్ చేశారు. మహేశ్‌కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్టసమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 16, 2022, 6:41 AM IST