ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాకున్న అనుభవంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: కిరణ్​కుమార్​ రెడ్డి

Ex Chief Minister Kiran Kumar Reddy comments: రాష్ట్రంలో రానున్న రోజుల్లో చురగ్గా పనిచేసి బీజేపీని బలోపేతం చేస్తామని, ఆ దిశాగా సాగేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గైడెన్స్ తీసుకున్నామని..ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై సోము వీర్రాజు, ఆర్‌ఆర్‌ఎస్ నేత మధుకర్‌లు కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.

BJP on YCP
BJP on YCP

By

Published : May 31, 2023, 7:12 PM IST

ex Chief Minister Kiran Kumar Reddy comments: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆర్‌ఆర్‌ఎస్ నేత మధుకర్‌లు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న కిరణ్‌ కుమార్ రెడ్డి కార్యాలయానికి సోము వీర్రాజు, ఆర్‌ఆర్‌ఎస్ నేత మధుకర్‌ చేరకుని..రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగతంగా బలోపేతం, చేరికల వంటి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

భేటీ అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..భారతీయ జనతా పార్టీ (బీజేపీ)అధిష్టానం ఎక్కడ పని చేయమంటే అక్కడే పని చేస్తానని వ్యాఖ్యానించారు. తనకున్న అంతో ఇంతో అనుభవంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆర్‌ఆర్‌ఎస్ నేత మధుకర్‌తో జరిగిన భేటీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించామన్నారు.

బీజేపీ అధిష్టానం ఎక్కడ పని చేయమంటే అక్కడే పని చేస్తా

BJP Executive Meeting వైసీపీ అవినీతిపై కొనసాగుతున్న బీజేపీ చార్జిషీట్లు.. పవన్​తో పొత్తుపై అధిష్టానిదే నిర్ణయమన్న నేతలు

బీజేపీలో చేరిన తర్వాత నెల రోజులపాటు అమెరికా వెళ్లానని కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వ పరిపాలనపై స్పందిస్తానన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. నేడు కిరణ్‌ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీ కార్యక్రమాలపై చర్చించమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై వివరించామని.. కిరణ్‌ కుమార్ రెడ్డి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆయన పార్టీ బలోపేతానికి సంబంధించి మంచి కార్యాచరణ ఉందని, అయన మార్గ నిర్ధేశనంలో పని చేస్తామని సోము వీర్రాజు వివరించారు.

''దేశ ప్రధాని నరేంద్ర మోదీ 9 సంవత్సరాల పరిపాలన సందర్భంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాము. నెల వ్యవధి కాలంలో చేసే కార్యక్రమాల జాబితాను ఆయనకు వివరించాము. రాబోయే రోజుల్లో ఆయన గైడెన్స్ తీసుకుని ముందుకు సాగుతాము. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో గట్టి పార్టీగా బీజేపీని ముందుకు నడిపిస్తాము. మరింత చురగ్గా పని చేస్తాము. ఆ దిశగా సాగేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు'' అని సోము వీర్రాజు అన్నారు.

బినామీలకు విద్యుత్ టెండర్లు కట్టబెట్టి.. వేలకోట్లు జగన్ దోచేస్తున్నారు: పట్టాభిరామ్

మరోపక్క భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు అధికంగా ఉందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విదుడల చేసే ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి ఉందా..? అని సత్యకుమార్‌.. సవాల్‌ విసిరారు.

'జనసేన-బీజేపీలు కలిసే ఉన్నాయి.. అరాచక ప్రభుత్వాన్ని కలిసే గద్దె దింపుతాం'

ABOUT THE AUTHOR

...view details