ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mother Kills 18 Days Old Baby: పుట్టిన 18రోజుల్లోనే.. పొత్తిళ్లలో శిశువును దారుణంగా కడతేర్చిన తల్లి.. మొదటి బిడ్డ కూడా..! - Baby murder

Mother Kills Her 18 Days Old Baby: కన్నతల్లే తన 18 రోజుల వయసున్న మగ శిశువును కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..

Mother_Kills_Her_18_Days_Old_Baby
Mother_Kills_Her_18_Days_Old_Baby

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 1:11 PM IST

Updated : Oct 11, 2023, 3:44 PM IST

Mother Kills 18 Days Old Baby: పుట్టిన 18రోజుల్లోనే.. పొత్తిళ్లలో శిశువును దారుణంగా కడతేర్చిన తల్లి.. మొదటి బిడ్డ కూడా..!

Mother Kills Her 18 Days Old Baby: నంద్యాల జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 18 రోజుల వయసున్న మగ బిడ్డను కన్నతల్లే కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసింది. పాము తన పిల్లలను తిన్నట్లుగా.. ఈ తల్లి కూడా నవమాసాలు మోసి కన్న తన బిడ్డను పొట్టనపెట్టుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షానుబి, మహేశ్ అనే దంపతులు నంద్యాల గాంధీనగర్​లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందట వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహమైనప్పటి నుంచి వీరిద్దరూ చాలా అన్యోన్యంగా.. కుటుంబ కలహాలులేకుండా ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. మహేశ్ నీటిశుద్ధి కేంద్రంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ దంపతులకు గతనెల 27న ఒక మగశిశువు జన్మించాడు. ఏమైందో ఏమో.. ఆ తల్లి.. తనబిడ్డను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది.

BABY DEATH: నీటితొట్టిలో 17 రోజుల పసికందు..ఏం జరిగిందంటే..!

ఇంట్లో తన భర్త లేని సమయం చూసి.. తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పి అత్తమామాలను మందుల కోసం బయటకు పంపించిన ఆమె.. ఈ దారుణానికి ఒడిగట్టింది. మంగళవారం రాత్రి 6-7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లోపలి నుంచి గడియ పెట్టుకున్న షానుబి.. ఇంటికి తిరిగొచ్చిన అత్తమామలు ఎంతసేపు తలుపులు తట్టినా తీయలేదు. ఆమె ఎంతకూ తెరవకపోవడంతో అత్తమామలు తలుపులు పగులగొట్టారు. లోపలికి వెళ్లి చూసిన అత్తమామలకు పసివాడు విగత జీవిగా ఉండటం చూసి నిర్ఘాంతపోయారు.

శిశువును చంపిన ఆ తల్లి.. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. దీనిపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నంద్యాల మూడో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ నరసింహులు తెలిపారు. కాగా, ఇంతకుముందు షానుబికి పుట్టిన మొదటి బిడ్డ(ఆడ శిశువు) కూడా 18 రోజులకే మృతువాత పడింది. ఇప్పుడు పుట్టిన బిడ్డ కూడా 18 రోజులకే హత్యకు గురికావటంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Baby murder: చిన్నారి హత్యలో తల్లి పాత్ర లేదు: డీసీపీ ఐశ్వర్య రస్తోగి

"నంద్యాల గాంధీనగర్​లో నివాసం ఉంటున్న షానుబి, మహేశ్ అనే దంపతులు మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు గతనెల 27న ఒక మగశిశువు జన్మించాడు. అయితే ఏమైందో ఏమో ఆ తల్లి.. తన బిడ్డను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఇంట్లో తన భర్త లేని సమయం చూసి.. తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పి అత్తమామాలను మందుల కోసం బయటకు పంపించిన ఆమె.. ఈ దారుణానికి ఒడిగట్టింది. మంగళవారం రాత్రి 6-7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా ఆమెకు పుట్టిన మొదటి బిడ్డ(ఆడ శిశువు) కూడా 18 రోజులకే మృతువాత పడింది. దీంతో పలు కోణాల్లో దీనిపై దర్యాప్తు చేపట్టాము." - నరసింహులు, సీఐ

Baby killed: విశాఖ మారికవలసలో మూడేళ్ల చిన్నారి హత్య

Last Updated : Oct 11, 2023, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details