ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు తలనొప్పిగా మారిన పత్తికొండ వర్గపోరు - కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్

కర్నూలు జిల్లాలో అధికార వైకాపాలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పత్తికొండ పట్టణంలో రెండు వర్గాల మధ్య పరస్పరం దాడులు.. పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఇందులో ఓ యువకుడిని అరెస్టు చేశారు.

ysrcp fighting
ysrcp fighting

By

Published : Nov 14, 2020, 9:05 AM IST

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గవిభేదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పట్టణంలోని వైకాపా నాయకుడు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి.. పోచంరెడ్డి యువసైన్యం పేరుతో తన వర్గాన్ని బలోపేతం చేస్తున్నారు. మరోవైపు మాజీ సర్పంచ్ కుమారులు మధు, గోవర్ధన్... ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి అనుచరులుగా ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తేరుబజారులో ఓ టీ దుకాణం వద్ద తేనీరు సేవిస్తుండగా.. పోచంరెడ్డి యువసైన్యానికి చెందిన యువకులు వీరిపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో గోవర్ధన్​కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితి అదుపుచేశారు. బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

తమపై దాడి జరిగిందని.. పోలీస్ స్టేషన్​లో మధు, గోవర్ధన్​ ఫిర్యాదు చేశారు. సాయంత్రం తమ ఫ్లెక్సీని మధు, గోవర్ధన్ చించేశారని పోలీస్ స్టేషన్​లో పోచంరెడ్డి ఫిర్యాదుచేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. మధు వర్గానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా.. ఎవరూ స్పందించటం లేదని.. గోవర్ధన్​ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

వర్గ విభేదాలపై అధిష్ఠానం దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. పార్టీలో బహిరంగంగా దాడులు చేసుకోవటం మంచిది కాదని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఈ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది.

ఇదీ చదవండి:దీపకాంతులతో సుందరంగా ముస్తాబైన ఆలయాలు

ABOUT THE AUTHOR

...view details