వరల్డ్ హర్ట్ డే సందర్భంగా కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె జబ్బులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్. గోపిచంద్ మననం హాజరయ్యారు. గుండె శస్త్ర చికిత్సల పై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్రమం తప్పకుండా వ్యాయామం, యెగా, ధ్యానం చేయడంతో పాటు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటే గుండెపోటు రాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కర్నూలు వైద్య కళాశాల అధ్యాపకుల గ్యాలరీలో ఏర్పాటు చేసిన డాక్టర్. పినాకపాని కాంస్య విగ్రహాన్ని ముఖ్య అతిథులు ప్రారంభించారు.
కర్నూలులో వరల్డ్ హర్ట్ డే.. గుండె జబ్బులపై అవగాహన - world heart day in kurnool
ఒత్తిడిని దూరం చేసుకుంటే గుండె జబ్బును దూరం చేసుకోవచ్చని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎండీ డాక్టర్ గోపించంద్ తెలిపారు.
వరల్డ్ హర్ట్ డే సందర్భంగా కర్నూలులో అవగాహన కార్యక్రమం