కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఓ మహిళా న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా అమ్మాయిపల్లికి చెందిన అశోకమ్మకు కర్నూలు జిల్లా అలంపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
కుటుంబ కలహాలతో భార్యభర్తలు విడిపోయినట్లు అశోకమ్మ తెలిపింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పోలకల్ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పరుశురాం తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు భాదితురాలు తెలిపింది. వివాహం అయిన కొన్ని రోజులకే తనను మోసం చేసి వెళ్లిపోయాడని... తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.