కర్నూలు జిల్లా ఆదోనిలో లక్ష్మమ్మ అవ్వ 87వ వెండి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురవీధుల్లో వెండి రథంలో లక్ష్మమ్మ అవ్వ దేవతా విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. రథోత్సవాన్ని చూసేందుక స్థానిక ప్రజలే కాక తెలంగాణ, కర్ణాటక నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
వెండి రథంలో ఊరేగిన 'లక్ష్మమ్మ అవ్వ'
వెండి రథంలో లక్ష్మమ్మ అవ్వ ఊరేగుతుంటే చూడడానికి స్థానిక ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యారు. కర్నూలు జిల్లా ఆదోనిలో లక్ష్మమ్మ అవ్వ రథోత్సవం కన్నులపండువగా జరిగింది.
లక్ష్మమ్మ అవ్వ రథోత్సవం