ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే ఆస్తులు వేలం వేయటానికి వీల్లేదు: టీజీ వెంకటేశ్ - టీజీ వెంకటేశ్ తాజా వార్తలు

తితిదే ఆస్తులు వేలం వేయటానికి వీల్లేదని, న్యాయస్థానాల నుంచి ఆదేశాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. రాయలసీమకు న్యాయం చేసే నీటి ప్రాజెక్టులను చేపట్టినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడం సరికాదని మండిపడ్డారు.

ttd assets cannot be auctioned says mp tg venkatesh
తితిదే ఆస్తులు వేలం వేయటానికి వీల్లేదన్న టీజీ వెంకటేశ్

By

Published : May 23, 2020, 7:38 PM IST

Updated : May 23, 2020, 8:29 PM IST

తితిదే భూముల వేలం నిర్ణయంపై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ స్పందించారు. ఆలయానికి చెందిన ఆస్తులు వేలం వేయటానికి వీల్లేదని, కోర్టుల నుంచి ఆదేశాలున్నాయని టీజీ స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించటం సరికాదు:

రాయలసీమకు న్యాయం చేసే నీటి ప్రాజెక్టులను చేపట్టినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడం సరికాదని టీజీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 203 జీవోను విడుదల చేస్తే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిందని అన్నారు. కర్ణాటక రాష్ట్రం నీటి ప్రాజెక్టుల నిర్మిస్తున్నా... తెలంగాణ నేతలు పట్టించుకోరని రాయలసీమ ప్రాజెక్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. 203 జీవోతో ఏమైనా నష్టం ఉంటే అడ్డుకోవాలే కాని ఎలాంటి నష్టం లేకున్నా అడ్డుకోవడం సరికాదన్నారు.

ఇదీ చదవండి:

'గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా మళ్లించండి'

Last Updated : May 23, 2020, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details