టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో రైతులు ధర్నా చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట టమాటాలను రోడ్డుపై పారేసి నిరసన తెలిపారు. రైతుల వద్ద.. కిలో టమాటా రెండు రుపాయలకు కొనుగోలు చేసి.. బయట కిలో రూ.15 నుంచి 30 రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. టమాటాను మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో టమాటా జూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
టమాటా రైతులను ఆదుకోవాలని నిరసన - tomato price
కర్నూలు జిల్లాలో టమాటా రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతుల వద్ద నుంచి కిలో టమాటా రూ.2కు కొనుగోలు చేసి.. బయట రూ.15కు విక్రయిస్తున్నారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.
టమాటా రైతులను ఆదుకోవాలని రైతుల నిరసన