కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఆదివారం రాత్రి గ్రామంలోని పొలాల్లో ఉన్న ఆవుల మందపై పులి దాడిచేసింది. అది గుర్తించిన కాపలాదారులు కేకలు పెట్టగా పులి వారిపైనా దాడికి ప్రయత్నించింది. వారు ఎలాగోలా తప్పించుకోగా.. ఒక ఆవును చంపేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే వారు సోమవారం ఉదయం వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్థులు చెప్పారు.
ఆవుల మందపై పెద్దపులి దాడి.. గోమాత మృతి - సింగవరం
పెద్దపులి దాడిలో గోమాత మృతిచెందింది. ఆవుల మందపై విరుచుకుపడిన పులి ఒక ఆవును చంపేసింది. కర్నూలు జిల్లాలోని సింగవరంలో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
ఆవుల మందపై పెద్దపులి దాడి.. ఆవు మృతి