ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలాంటి వారిని నడిరోడ్డుపై ఉరి తీయాలి: టీజీ వెంకటేశ్

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. మరోవైపు కరోనాను వ్యాప్తి చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

By

Published : Apr 5, 2020, 3:42 PM IST

tg venkatesh news
tg venkatesh news

ఈటీవీ భారత్​తో టీజీ వెంకటేశ్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని భాజపా రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేశ్ అన్నారు. దిల్లిలో మతపరమైన కార్యక్రమానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్లే ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన ఆరోపించారు. దేశంలో కరోనా వైరస్​ను వ్యాప్తి చేయాలంటూ కొందరు సామాజిక మాధ్యమాల ప్రచారం చేస్తున్నారని టీజీ వెంకటేశ్ మండిపడ్డారు. అలాంటి వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎంతగానో కృషి చేసిందని టీజీ అన్నారు. కరోనా వైరస్ నివారణకు అవసరమైన కార్యక్రమాల కోసం ఎంపీ నిధులు, టీజీవీ గ్రూపు సంస్థల నుంచి మొత్తం 4 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details