ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత - muncipal elections 2021

నంద్యాల 27వ వార్డు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా అభ్యర్థి గెలుపునకు చేరవలో ఉండగా...వైకాపా నాయకులు తిరిగి పరిశీలించాలని డిమాండ్ చేశారు.

పోలీసులతో చర్చలు జరుపుతున్న తెదేపా నేతలు
పోలీసులతో చర్చలు జరుపుతున్న తెదేపా నేతలు

By

Published : Mar 14, 2021, 6:21 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల 27వ వార్డు లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా అభ్యర్థి శ్రీదేవి 35 ఓట్ల ఆధిక్యంలో గెలుపునకు చేరువలో ఉండగా...తిరిగి పరిశీలించాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. దీంతో తెదేపా, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి తెలుకున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి లెక్కింపు కేంద్రానికి చేరుకుని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. తమ అభ్యర్థి గెలుపొందినప్పటికీ అభ్యంతరం చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. చెల్లని ఓట్లను పరిశీలించిన తర్వాత 29 ఓట్లతో తెదేపా అభ్యర్థి శ్రీదేవి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి:ఎన్నికలేవైనా విజయం వైకాపాదే : కార్మిక శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details