ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై మాక్ డ్రిల్ చేపట్టిన ఆక్టోపస్

శ్రీశైలం జలాశయంలో మాక్ డ్రిల్ నిర్వహించిన ఆక్టోపస్ భద్రతాదళాలు. ఈ మాక్​ డ్రిల్​ను ప్రజలు ఆసక్తిగా చూశారు.

By

Published : Aug 18, 2019, 11:02 AM IST

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై మాక్ డ్రిల్ చేపట్టిన ఆక్టోపస్

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై మాక్ డ్రిల్ చేపట్టిన ఆక్టోపస్

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పై అక్టోపస్ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. శ్రీశైలం జలాశయం పరిసరాల్లోకి శత్రువులు ప్రవేశించినప్పుడు, వారిని ఎదుర్కొనే విధానాన్ని ఈ మాక్ డ్రిల్ ల్లో ఆక్టోపస్ బృందం చేసి చూపించింది. ఎస్పీ సిద్ధిఖ్ ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ జరిగింది. ఈ మాక్ డ్రిల్ ను చూసిన ప్రజలు ప్రాజెక్టు భద్రతపై ఆక్టోపస్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details