కర్నూలులో ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్ పైనుంచి పడి ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. మృతురాలు నన్నూరు జిల్లాపరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న విద్యుల్లతగా గుర్తించారు. నగరంలోని ఎంఎస్.9 ప్రియా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. 12 గంటల సమయంలో తీవ్రగాయాలతో కిందపడి ఉన్న విద్యుల్లతను భర్త కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదవశాత్తు కింద పడిందా... లేదా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు రెండురోజుల నుంచి ఆరోగ్యం సరిగాలేదని పాఠశాలకు వెళ్లటంలేదని పోలీసుల విచారణలో తెలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అపార్ట్‌మెంట్ పైనుంచి పడి ఉపాధ్యాయురాలు మృతి..? - kurnool
కర్నూలులో ఓ ఉపాధ్యాయురాలు ఆమె నివసిస్తున్న అపార్టుమెంట్ పైనుంచి పడి చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అపార్ట్‌మెంట్