కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో ఓ తెదేపా నాయకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీరు చెట్టు పథకంలో పనులు చేసి బిల్లులు రాని కారణంగా మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడు కొండారెడ్డి భౌతికకాయాన్ని తెదేపా నేతలు, మాజీ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు సందర్శించారు. వైకాపా ప్రభుత్వ వైఖరి వల్లే తెదేపా నాయకులు మృతి చెందుతున్నారని వారు మండిపడ్డారు. తెదేపా నాయకులు బిల్లులు ఆపటం దారుణమన్నారు. సీఎం జగన్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
'ప్రభుత్వ వైఖరి వల్లే తెదేపా నాయకుల ఆత్మహత్యలు'
ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో తెదేపా నాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి ఎన్.ఎమ్.డి ఫరూక్ ఆరోపించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన తెదేపా నాయుకుడు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
'వైకాపా ప్రభుత్వ వైఖరి వల్లే తెదేపా నాయకుల ఆత్మహత్యలు'