కర్నూలులో హంద్రీ నదిపై వంతెనను నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ తదితరులు పరిశీలించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో... హంద్రీపై వంతెన నిర్మాణం చేపడితే... ప్రస్తుత ప్రభుత్వం దానిని పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని విమర్శించారు. దీనికి ఓటర్ల జాబితాలో హీరో వెంకటేష్ ఫోటో ఉండటమే నిదర్శనమన్నారు.
కర్నూలుకు ఏం చేశారో చెప్పాలి: తెదేపా నేతలు
వైకాపా ప్రభుత్వం అర్హులైనవారి పింఛన్లు తొలగించిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ల జాబితాలో హీరో వెంకటేష్ ఫోటో ఉండటం తప్పులతడకకు నిదర్శనమన్నారు. హంద్రీ నదిపై వంతెనను నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ తదితరులు పరిశీలించారు.
హంద్రీ నదిపై వంతెనను పరిశీలించిన తెదేపా నేతలు
ఎంతోమంది అర్హులైన లబ్దిదారులకు ఫించన్లు, రేషన్ కార్డులు తొలగించారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 17న కర్నూలుకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్... ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...