కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్త దుర్గాప్రసాద్ పై తెదేపా శ్రేణులు దాడి చేసినట్లు డోన్ డీఎస్పీ నరసింహ రెడ్డి తెలిపారు. రాజు అనే వైకాపా కార్యకర్తపై తెదేపా వర్గీయులు దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయాలైనట్లు డీఎస్పీ తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డితో పాటు మరికొందరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఒకరికి తీవ్ర గాయాలు - tdp and ycp activists fight at banaganapally in kurnool district
కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో ఇరువర్గాల మధ్య దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైకాపా కార్యకర్తపై తెదేపా వర్గీయుల దాడి
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.. ఆస్పత్రి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరహా దాడలు జరిగితే సహించబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి..'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'