కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ నగర్‌కు చెందిన సాయికుమార్ (21) అనే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాల సమీపంలో పొన్నాపురం రైల్వే ట్రాక్ వద్ద ఉన్న కేసీ కెనాల్లో దూకాడు.
కాలువలో దూకి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కాలువలో దూకి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నంద్యాల సమీపంలో పొన్నాపురం రైల్వే ట్రాక్ వద్ద జరిగింది. పరీక్షలు సరిగా రాయలేదని మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నంద్యాల కేసీ కాలువలో దూకి విద్యార్థి ఆత్మహత్య
పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఎంఈసి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రథమ సంవత్సరంలో కొన్ని సబ్జెక్టులు ఫెయిలైన సాయికుమార్ ద్వితీయ సంవత్సర పరీక్షలు సరిగా రాయలేదని మనస్తాపం చెందాడు. యువకుడి మృతదేహం గొస్ఫాడు మండలం సాంభవరం వద్ద కేసీ కాలువలో లభ్యమైంది. సాయికుమార్ తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలు పట్టివేత