ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తనువు చాలించిన విద్యార్ధి వానరం..తీవ్ర విషాదంలో విద్యార్ధులు - kurnool district

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో విద్యార్ధి వానరంగా పేరు తెచ్చుకున్న కొండముచ్చు వానరం ఇక లేదు. ప్రతిరోజు విద్యార్థులతో పాటు బడికి వెళ్తూ, వారితో కలసిపోయిన కొండముచ్చు పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తీవ్రగాయలతో తనువు చాలించిన ఆ వానరాన్ని చూసి విద్యార్దులు, ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరు అయ్యారు. కొండముచ్చు కోతి మృతితో పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కొండముచ్చు కోతి మృతి

By

Published : Sep 8, 2019, 4:38 PM IST

తనువు చాలించిన విద్యార్ధి వానరం..తీవ్ర విషాదంలో విద్యార్ధులు

కర్నూలు జిల్లా ప్యాపిలి వెంగలాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది.పాఠశాలకు విద్యార్దులతో పాటే హజరయ్యే కొండముచ్చు కోతి తనువు చాలించింది.రోజు విద్యార్థులతో బడికి హాజరవుతూ,ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఆలకించే ఈ కొండముచ్చు,విద్యార్దులతో మమేకమైపోయింది.విద్యార్దులు చెప్పింది వింటూ,వారు చెప్పినట్లు నడుచుకునే ఈ కొండముచ్చుతో వారికి అనుబంధం ఏర్పడింది.ఉదయానే పాఠశాలకు వచ్చి,పాఠశాల సమయం ముగిసాక విద్యార్దులతో పాటే బయటకు వెళ్లిపోయే ఈ కొండముచ్చు,కుక్కల బారిన పడి తీవ్రంగా గాయపడి చనిపోయింది.విద్యార్ది వానరంగా జిల్లాలో సుపరిచయంగా ఉన్న ఈ కొండముచ్చును ప్రజలు ఆసక్తిగా చూసేవారు.ఇప్పుడు ఈ వానరం మృతి చెందడంతో విద్యార్థులు,ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరు అయ్యారు.ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి,వానరంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.పాఠశాలలోతమతో గడిపిన ఈ కొండముచ్చు గుర్తుగా పాఠశాలలో పోస్టర్ ను ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయుడు లతీఫ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details