కర్నూలు జిల్లా ఆదోనిలో హత్యకు గురైన ఆడమ్ స్మిత్ కుటుంబసభ్యులను... రాష్ట్ర మహిళ సంఘాల నేతలు పరామర్శించారు. నందవరం మండలంలోని గురుజాలలో ఆడమ్ తల్లిదండ్రులు, భార్యతో మాట్లాడారు. ప్రభుత్వ నిఘా వైఫల్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల దూరహంకారం కారణంగానే ఆడమ్ స్మిత్‌ను హతమార్చారని ఆరోపించిన నేతలు... ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని వాపోయారు. శిక్షలు కఠినంగా అమలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని హితవు పలికారు.
'ఆడమ్ స్మిత్ హత్యపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం'
ఆదోనిలో హత్యకు గురైన ఆడమ్ స్మిత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మహిళ సంఘాల నేతలు పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ హత్య జరిగిందన్న వారు... ఈ ఘటనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
ఆడమ్ స్మిత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మహిళ సంఘాల నేతలు పరామర్శ