ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సార్..నేను ఏ తప్పూ చేయలేదు: ఆత్మహత్యకు ముందు డ్రైవర్​ ఆవేదన

నంద్యాలకు చెందిన ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తూ...ఆందోళన చేపట్టారు. వారు ఆత్మహత్యకు ముందు మాట్లాడిన సెల్పీ వీడియో లభించింది. ఈ వీడియోలో తాను ఏ తప్పు చేయలేదని మృతుడి పేర్కొన్నాడు.

some-are-demanding-an-inquiry-into-the-incident-in-which-a-family-from-nandyal-committed-suicide-by-falling-off-a-train
సార్....నేను ఏ తప్పు చేయలేదు: ఆత్మహత్యకు ముందు డ్రైవర్​ ఆవేదన

By

Published : Nov 7, 2020, 9:30 AM IST

Updated : Nov 7, 2020, 7:46 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మూలసాగరానికి చెందిన అబ్దుల్ సలాం ఓ బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేసేవాడు. భార్య నూర్జహాన్ ప్రైవేటు స్కూల్లో టీచర్. అదే పాఠశాలలో కుమార్తె సల్మా తొమ్మిదో తరగతి, కుమారుడు దాదా కలాందర్ ఆరో తరగతి చదువుతున్నారు. 2019 నవంబర్ నెలలో ఆభరణాల దుకాణంలో బంగారం చోరీ జరిగింది. అబ్దుల్ సలామే మూడు కిలోల బంగారం అపహరించారని.. యజమాని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. పోలీసులు విచారించి.. 500 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. 42 రోజులు రిమాండ్​లో ఉండి.. ఈ మధ్యనే ఇంటికి వచ్చారు. నంద్యాలలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రాత్రి ఆటోలో రూ.70 వేలు నగదు చోరీకి గురైందని.. పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో బంగారం చోరీ కేసులో నిందితుడుగా ఉన్న అబ్దుల్ సలాం ఆటో అని గుర్తించి పోలీసులు విచారించారు.

ఓ వైపు బంగారు ఆభరణాల చోరీ కేసు, మరోవైపు రాత్రి జరిగిన ఘటన, రిమాండ్​.. విచారణను తలచుకుని అబ్దుల్ సలాం రాత్రంతా నిద్రలేకుండా గడిపాడు. ఇలా బాధపడడం కంటే.. ఆత్మహత్య చేసుకోవడమే మేలని కుటుంబ సభ్యులతో చెప్పాడు. నువ్వు లేకుండా మేము బతకలేమని కుటుంబ సభ్యులు చెప్పారు. ఉదయం స్కూలుకు వెళుతున్నామని చెప్పి.. అందరూ కలిసి ఆటోలో పాణ్యం మండలం కౌలూరుకు వెళ్లారు. రైల్వేట్రాక్ సమీపంలో ఆటో ఆపారు. అందరూ కలిసి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే తాజాగా వారు ఆత్మహత్యకు ముందు మాట్లాడిన వీడియో లభించింది. తాను ఎలాంటి దొంగతనం చేయలేదని అబ్దుల్ సలాం వీడియోలో చెప్పాడు. ఆటోలో ప్రయాణికుడు మరిచిపోయిన నగదుపై పోలీసులు తరచూ స్టేషనుకు రమ్మని వేధిస్తున్నారని సలాం వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

సెల్ఫీ వీడియో

ఇదీ చదవండి:

రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి

Last Updated : Nov 7, 2020, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details