కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. కుంబారు గెరి వద్ద వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం రహదారి వైపు కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వాహన చోదకుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఎటువంటి ప్రాణాపాయం జరగనందున స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలో కుప్పకూలిన విద్యుత్ స్తంభం
విద్యుత్ స్తంభాన్ని వాహనం ఢీకొట్టింది. స్తంభం నేలకొరిగింది. ఆ సమయాన ఎవరు ఆ ప్రదేశంలో లేనుందున స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వాహనం