కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాల ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఆసుపత్రి పరిశుభ్రంలో నిత్యం కష్టపడే తమకు వేతనాలు రాకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. వైయస్ఆర్ సర్కార్ తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - dharna
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట విధులు బహిష్కరించి పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులు ధర్నా