కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. కొండపేటలోని రాజశేఖర రెడ్డి ఇంటో దొంగలు చోరికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులతో కలిసి రాజశేఖర రెడ్డి నిన్న సాయంత్రం కర్నూలు వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 తులాల బంగారం, 3 కిలోల వెండి, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు తెలిపారు.
కోడుమూరులో భారీ చోరీ.. 70 తులాల బంగారం, 3 కిలోల వెండి మాయం - kodumuru crime news
కర్నూలు జిల్లా కోడుమూరులోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 70 తులాల బంగారం, 3 కిలోల వెండి, రూ.లక్ష నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.
robbery at kodumuru karnool district