ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో 35 బస్తాల రేషన్​ బియ్యం పట్టివేత

కర్నూలు జిల్లా నంద్యాలలో అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదుచేశారు.

నంద్యాలలో 35 బస్తాల రేషన్​ బియ్యం పట్టివేత
నంద్యాలలో 35 బస్తాల రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Jun 14, 2020, 11:18 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 35 బస్తాల బియ్యాన్ని ఆటోలో కడప జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటో యజమానులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలో బియ్యం వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి ఈ అక్రమానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అతనిపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో చొరవ చూపిన ఇద్దరు పోలీసులకు నగదు ప్రోత్సాహకాన్ని సీఐ సోమశేఖర్ రెడ్డి అందజేశారు.

ఇదీ చూడండి:500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details