కర్నూలు జిల్లా కోడుమూరులో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఖరీఫ్ లో సరైన సమయానికి వర్షాలు పడకపోవటం వలన రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కేవలం 25 శాతం మాత్రమే పంటలు సాగుచేస్తున్నారు.ఇవాళ కురిసిన తేలికపాటి వర్షంతో రైతులకు కొంత మేరఊరట లభించింది. పెద్ద వర్షాలు వస్తే భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.
కోడుమూరులో మోస్తరు వర్షం
ఖరీఫ్‌లో సరైన సమయంలో వానలు లేకపోవడం వలన రైతులు పంటలు సాగుచేయలేని పరిస్థితి. ఎట్టకేలకు వరుణుడు రాకతో కోడుమూరులో మోస్తరు వర్షం పడింది.
కోడుమూరు