పేకాడుతూ పట్టుబడినవారిపై.. ఓ పోలీసు అధికారి పైపు విరగ్గొట్టాడు. కర్నూలు జిల్లా బందుఆత్మకూరు మండలం జీసీ పాలెం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేకాడుతుండగా.. ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందలించే క్రమంలో ఎస్సై కీర్తి.. వారిని పైపుతో చితకబాదారు. నలుగురికి శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. వారంతా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జూదగాళ్లను పైపుతో చితకబాదిన ఎస్సై - pekataraillu_gayalu
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై.. వారిని ఎస్సై చితకబాదారు.
జూదగాళ్లను పైపుతో చితకబాదిన ఎస్సై