ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో సచివాలయాన్ని ముట్టడించిన కాలనీ వాసులు - Kurnool district latest news

రహదారి సమస్య పరిష్కరించాలని ఆదోనిలో సచివాలయాన్ని ముట్టడించారు. కొద్దిసేపు కార్యాలయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. త్వరలోనే సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణ హామీఇచ్చారు.

People Protest in Adoni Town with Road Problem
ఆదోనిలో సచివాలయాన్ని ముట్టడించిన కాలనీవాసులు

By

Published : Nov 17, 2020, 10:09 PM IST

రహదారి సమస్య పరిష్కరించాలని ఓ కాలనీ వాసులు కర్నూలు జిల్లా ఆదోనిలో సచివాలయాన్ని ముట్టడించారు. పట్టణంలోని 8వ వార్డ్ సచివాలయాన్ని ముట్టడించి.... అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు కార్యాలయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

కొన్ని రోజులుగా బిల్డరు, స్థానికుల మద్య గొడవలు ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని ఆందోళన చేశారు. సచివాలయానికి పోలీసులు చేరుకొని ఘర్షణ సద్దుమనిగేలా చేశారు. త్వరలోనే రహదారి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణ హామీఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details