ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - kurnool

స్నేహితులతో సంతోషంగా గడిపి తిరిగి వెళ్తున్నాడు. అంతోలోనే కాలం కాటేసింది. కర్నూలు జిల్లాలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన భూమా శేఖర్ రెడ్డి

By

Published : Aug 5, 2019, 12:40 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన భూమా శేఖర్ రెడ్డి

కర్నూలు జిల్లా నంద్యాల బొగ్గులైన్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే... బండి ఆత్మకూరు మండలం సోమయాజుల పల్లెకు చెందిన భూమా శేఖర్ రెడ్డి... బెంగుళూర్​లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగులచవితికి స్నేహితులను కలిసేందుకు నంద్యాలకు వచ్చి...తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శేఖర్ రెడ్డి ద్విచక్రవాహనంపై నూనెపల్లె నుంచి బొమ్మలసత్రం వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది.దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details