ఈ వృద్ధురాలు కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గుంప్రమాన్‌దిన్నె గ్రామానికి చెందిన దాయాది మునెమ్మ. వయసు 70 ఏళ్లు. ఆధార్ కార్డులో మాత్రం ఆమె పుట్టిన సంవత్సరం పొరపాటున 2006గా నమోదైంది. ఇప్పుడదే ఆమె కొంపముంచింది. ఆధార్ ప్రకారం మునెమ్మ వయసు 15 ఏళ్లు కావడంతో సర్కారు రెండు నెలలుగా పింఛను నిలిపేసింది. కూలిపనులు చేసుకుని జీననం సాగించే అవ్వకు పింఛను ఓ భరోసా. దాన్ని రద్దు చేయడంతో సచివాలయం, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. పింఛను పునరుద్ధరించి ఆదుకోవాలని వేడుకుంటోంది. పంచాయతీ కార్యదర్శి రవిశంకర్‌ను వివరణ కోరగా అధికారుల ఆదేశానుసారం నిర్వహించిన సర్వేలో మునెమ్మ వయసు తక్కువగా ఉన్న కారణంగా తొలగించామని చెప్పారు.
కనిపించే వృద్ధాప్యానికి ‘ఆధారం’ కావాలా?
ఆధార్‌లో తప్పుగా నమోదైన వివరాలు లబ్ధిదారుల కొంప ముంచుతున్నాయి. వాటినే కారణంగా చూపుతున్న ప్రభుత్వం వారు పొందాల్సిన పింఛన్లను నిలిపేస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక.. సచివాయం, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
old women pension problems