ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళాశాల బాగు కోసం పూర్వవిద్యార్థుల చేయూత

ఆ కళాశాలలో వారంతా ఒకప్పుడు చదువుకున్న విద్యార్థులు. తమ వంతు సహాయంగా ఏదైనా చెయ్యాలనుకున్నారు. రూ.50లక్షలతో విద్యార్థుల కోసం లెర్నింగ్ సెంటర్ నిర్మించారు.

కళాశాల కోసం పూర్వవిద్యార్థుల చేయూత
కళాశాల కోసం పూర్వవిద్యార్థుల చేయూత

By

Published : May 3, 2021, 4:51 PM IST

కర్నూలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వవిద్యార్థులు వారు చదువుకున్న కళాశాలకు తమవంతు సహాయం చేశారు. 1979-81 సంవత్సరంలో ఇంటర్ చదివిన కే.రవీందర్ రెడ్డి తమ కళాశాలకు ఏదైనా చేయాలని అధ్యాపకులను సంప్రదించగా.. విద్యార్థుల కోసం భవనం నిర్మించాలని సూచించారు. దీంతో ఆయన స్పందించి భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

రూ. 50 లక్షల నిధులతో విద్యార్థుల కోసం లెర్నింగ్ సెంటర్ నిర్మించారు. ఈ కేంద్రాన్ని నేడు ప్రారంభించి ప్రభుత్వానికి అంకితం చేశారు. అదే విధంగా 1980-82 పూర్వ విద్యార్థులు... కళాశాల ప్రధాన బిల్డింగ్‌ను 20 లక్షల రూపాయలతో ఆధునీకరించారు. ఈ సందర్భంగా పూర్వ విధ్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details