కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద అంతరాష్ట్ర తనిఖీల్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అక్రమంగా మద్యం తరలిస్తూ సెబ్ అధికారులకు చిక్కాడు. కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన అన్వర్ బాష సీఆర్పీఎఫ్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే సెలవులపై స్వగ్రామానికి వచ్చిన బాష.. మంగళవారం తన మిత్రుడు బాలకృష్ణతో కలిసి తెలంగాణ నుంచి మద్యం తీసుకెళ్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి.. 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మద్యం తరలిస్తూ అధికారులకు చిక్కిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ - కర్నూలు తాాజా వార్తలు
అక్రమంగా మద్యం తరలిస్తూ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అధికారులకు చిక్కాడు. అంతరాష్ట్ర తనిఖీల్లో భాగంగా పట్టుకున్న అధికారులు అతనితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
officers cought crpf constable with alcohol illegal supply