ఆధార్ కార్డును ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసుకునేందుకు ఆధార్ నమోదు కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా చేరుతున్నారు. వైఎస్సార్ చేయూత పథకం వర్తించేందుకు 45ఏళ్లు నిండిన వారు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలనే ప్రభుత్వ సూచించింది. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రభుత్వ ఆధార్ నమోదు కేంద్రాల వద్ద వేకువ జామున ఐదు గంటల నుంచే ప్రజలు వేచి ఉన్నారు. కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండటంతో ఉదయాన్నే వచ్చామని ఆధార్ లింక్ చేయకపోతే.. పథకాల లబ్ధి పొందలేమని ప్రజలు చెబుతున్నారు. దీంతో కరోనా నిబంధనలు మరచి.. భౌతిక దూరం పాటించని పరిస్థతి నెలకొంది.
ఆధార్ నమోదు కేంద్రాల వద్ద బారులు తీరిన జనం - nandyal latest news
కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రభుత్వ ఆధార్ నమోదు కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. తమ ఆధార్ కార్డును ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు.
ఆధార్ కేంద్రాల వద్ద గుమికూడిన జనం