కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లేకళ్ళులో తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. ఏడు నెలలుగా ప్రజలు తాగునీటి ఇబ్బంది పడుతున్నా సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని ఆవేదన చెందుతున్నారు. గ్రామ సభలో కొంత మంది మహిళలు ప్రశ్నించినా.. అధికారులు దురుసుగా సమాధానం ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
7 నెలలుగా తాగునీరు లేదు.. గోడు వినేవారు లేరు
ఓ వైపు వర్షాలు పడుతుంటే కొన్ని గ్రామాల్లో ఇంకా తాగు నీటి సమస్య వెక్కిరిస్తోంది. ఏడు నెలలుగా ఆ గ్రామ ప్రజలు నీటి కోసం అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఎవరూ స్పందించడం లేదు. చేసేది లేక ఆందోళన చేపట్టారు. వర్షాకాలంలోనూ వినిపిస్తున్న ఈ తాగునీటి గోడు కర్నూలు జిల్లా ఆదోని ప్రజలది.
గోడు వినే నాధులు లేరు