కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నందున అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దుకాణాలను మూసివేశారు. ఫలితంగా జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రెడ్ జోన్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఇళ్లలోంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కర్నూలులో మరింత కఠినంగా లాక్డౌన్ - lockdown
రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కర్నూలు జిల్లాలోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా వైరస్ వ్యాప్తి నివారణకు పోలీసులు, అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రాకుండా సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.
కర్నూలులో మరింత కఠినంగా లాక్డౌన్