'మల్లికార్జునుడికి వాహన సేవ'
శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి వాహన సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తితిదే ఈవో అనిల్ సింఘాల్ మల్లన్నను దర్శించుకున్నారు.
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వాహన సేవ నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రాంగణంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. డప్పులు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని పురవీధుల్లో ఉరేగించారు. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మల్లన్న సేవలో పాల్గొన్నారు. తితిదే తరపున బుధవారం ఉదయం ఆయన స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.