కొవిడ్ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. పట్టణంలోని అన్ని పోలీసు స్టేషన్ లకు ఒక్కో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పరికరాన్ని ఎమ్మెల్యే వితరణ చేశారు. కర్ఫ్యూ సమయంలో పోలీసులు కష్టపడుతున్నారని... వారికి తమ వంతుగా ఈ సహయం చేశానని హఫీజ్ ఖాన్ చెప్పారు. కార్యక్రమంలో సీఐలు పార్థసారధి రెడ్డి, తబ్రేజ్, రమణ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఉదారత.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వితరణ
కరోనా సోకితే భయపడకుండా వైద్యులను సంప్రదించాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్నవారికి తమ వంతు సాయంగా కాన్సన్ట్రేటర్లను వితరణ చేశారు.
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్