తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న విమర్శలకు అర్థం లేదని పేర్కొన్నారు. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ అనే వ్యక్తి ఇంటి వద్ద వదిలివెళ్లడానికి వచ్చారని స్పష్టం చేశారు. తన కుమారుడికి, ఈఎస్ఐ కుంభకోణానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఏ-14గా ఉన్న వ్యక్తి నుంచి కారు తీసుకొని ఉంటే... కేసు నుంచి తప్పిస్తానుగా అని వ్యాఖ్యానించారు. ఆ కేసులో ఉన్న ఎవ్వరితోనూ తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
'పదవులు లేక తెదేపా నేతలకు మతిభ్రమించింది'
తెదేపా నేతలకు పదవులు లేకపోకపోవడం వల్ల మతిభ్రమించిందని... మంత్రి జయరాం విమర్శించారు. నారా లోకేశ్ పెట్టే ట్వీట్లకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. దొడ్డిదారిన వచ్చి మంత్రి అయ్యారని ధ్వజమెత్తారు. తన కుమారుడికి ఈఎస్ఐ స్కాంకు ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు.
మంత్రి జయరాం