ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: పీర్ల గుండంలో దూకి వ్యక్తి ఆత్మహత్య - sunkesula latest news

మొహర్రం వేడుకలను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి పీర్ల గుండంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే ఈ విషాదం జరిగింది. బయటకు తీసేలోపే ప్రాణాలొదిలాడు.

పీర్ల గుండంలో దూకి వ్యక్తి ఆత్మహత్య
పీర్ల గుండంలో దూకి వ్యక్తి ఆత్మహత్య

By

Published : Aug 20, 2021, 7:40 AM IST

Updated : Aug 20, 2021, 12:39 PM IST

కర్నూలు జిల్లా అవుకు మండలంలోని సుంకేసుల గ్రామంలో పీర్ల గుండంలో దూకి వ్యక్తి మృతి చెందాడు. కాశీపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (55) అనే వ్యక్తి మొహర్రం వేడుకలను తిలకించేందుకు పీర్ల గుండం వద్దకు వచ్చాడు. స్థానికులు చూస్తుండగానే ఉన్నట్లుండి ఒక్కసారిగా పీర్ల గుండంలోకి దూకాడు. స్థానికులు గమనించి బయటకు తీసేలోపే పూర్తిగా కాలిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్వరరెడ్డి తెలిపారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

SUICIDE: పీర్ల గుండంలో దూకి వ్యక్తి ఆత్మహత్య
Last Updated : Aug 20, 2021, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details