ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు - manipulations in distribution of ration rice news

పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ప్రజాపంపిణీ ద్వారా బియ్యం అందిస్తుంది. కానీ అవి కూడా వారికి చేరనివ్వకుండా కొంతమంది వాటితో అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా గాజులపల్లెలో అంత్యోదయ కార్డులు ఉన్నవారికి రేషన్​ బియ్యం పంపిణీ సరిగ్గా జరగటంలేదు.

stored rice
రేషన్​ దుకాణంలో నిల్వ ఉన్న బియ్యం

By

Published : Nov 3, 2020, 7:09 AM IST

కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని అర్హులకు రేషన్​ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయి. ఆర్​.ఎస్​ చెంచుకాలనీలో నూట ఎనిమిది అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ప్రతి కార్డుకు 35కిలోల చొప్పున బియ్యం అందించాలి. కానీ తక్కువగా కేటాయింపులు చేస్తున్నారు. ఈ సమస్యపై కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన అధికారులకు 230 క్వింటాళ్ల బియ్యం రేషన్​ దుకాణంలో నిల్వ ఉన్నట్లు ఈ-పాస్ యంత్రం చూపించింది. మూడేళ్లుగా ఈ-పాస్ యంత్రం సాయంతో కాకుండా కాగితాల్లో పేర్లు నమోదు చేసి కార్డు దారులకు బియ్యం ఇచ్చినట్లు తేలింది. కానీ కొంతమందికి మాత్రమే బియ్యం ఇచ్చి మిగతా బియ్యాన్ని డీలర్లు దారి మళ్లించినట్లు స్థానికులు చెబుతున్నారు. నిల్వ ఉన్న బియ్యంపై పూర్తి వివరాలు తెలుసుకున్నాకే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details