ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానందిలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

కర్నూలు జిల్లా మహనందిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. మహనందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు వేద పండితులు అశ్వవాహన సేవ నిర్వహించారు.

mahanandi brahmotsavalu
మహనందిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 10, 2021, 5:10 AM IST

మహనందిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శైవ క్షేత్రం, కర్నూలు జిల్లా మహనందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో మొదలయ్యాయి. ఈ నెల 14 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గర్భాలయం ఎదుట ఉన్న ధ్వజస్తంభం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం మహానందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు అశ్వవాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details