ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో లారీ బీభత్సం... ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు - కర్నూల్లో తాజా లారీ ప్రమాదం వార్తలు

కొత్త సంవత్సరంలో స్నేహితులతో సరాదాగా గడిపిన వీరనాయుడు అనే ఇంటర్ విద్యార్థిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. యువకుడు వెళ్తున్న బైక్​ను లారీ బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలులో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

కర్నూలులో లారీ బీభత్సం... ఒకరు మృతి,మరో 6మందికి గాయాలు
కర్నూలులో లారీ బీభత్సం... ఒకరు మృతి,మరో 6మందికి గాయాలు

By

Published : Jan 1, 2020, 10:19 PM IST

కర్నూలులో లారీ బీభత్సం... ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

కర్నూలులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని, కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇది జరిగింది...
కర్నూలులో లారీ బీభత్సం సృష్టించింది. కృష్ణానగర్​లోని ఐటిసి కంపెనీ వద్ద లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో వీర నాయుడు అనే ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నూతన సంవత్సరంలో స్నేహితులతో గడిపిన వీరనాయుడుని చూసి...తోటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details