ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరుగా వైకాపా భూకబ్జాల దందా.. నిల‌దీసిన వృద్ధులకు బెదిరింపులు: లోకేశ్

కర్నూలు జిల్లా పత్తికొండలో కోర్టు పరిధిలో ఉన్న 8.25 ఎకరాల భూమిని వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి బినామీ బాబిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. భూ వివాదం కోర్టులో ఉండగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా.. వృద్ధ దంపతులైన మురళీమోహన్ గౌడ్, జయదేవీలను చంపుతామని బెదిరించటం వైకాపా అరాచకాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.

జోరుగా వైకాపా భూకబ్జాల దందా
జోరుగా వైకాపా భూకబ్జాల దందా

By

Published : Apr 1, 2022, 5:46 PM IST

వైకాపా భూక‌బ్జాల దందా రాష్ట్రంలో జోరుగా సాగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా పత్తికొండలో కోర్టు పరిధిలో ఉన్న 8.25 ఎకరాల భూమిని వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి బినామీ బాబిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆరోపించారు. భూవివాదం కోర్టులో ఉండగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా.. వృద్ధ దంపతులైన మురళీమోహన్ గౌడ్, జయదేవీలను చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. బాధిత వృద్ధుల‌కు పోలీసులు ర‌క్షణ క‌ల్పించటంతోపాటు భూమి క‌బ్జా చేసిన బాబిరెడ్డిపై కేసు నమోదు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details