ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక, తెలంగాణ నుంచి మద్యం తరలింపు... 50 బాక్సులు స్వాధీనం - illegal liquor seized news

కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్​పోస్టు వద్ద ఎస్​ఈబీ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. యాభై పెట్టెల్లోని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని సీజ్​ చేశారు.

liquor seized
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు

By

Published : May 11, 2021, 7:32 PM IST

కర్ణాటక, తెలంగాణ నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తుండగా.. రాష్ట్ర ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్​పోస్టు వద్ద రెండు వేర్వేరు సంఘటనల్లో... యాభై పెట్టెల్లోని ఇతర రాష్ట్రాల మద్యం సీసాలను సీజ్​ చేశారు.

రెండు వాహనాలు.. 50 బాక్సుల మద్యం

డోన్ మండలం గుండాల గ్రామానికి చెందిన ఈడిగ కేశవయ్య, రాంబాబు.. కారులో కర్ణాటక నుంచి 30 పెట్టెల్లో మద్యం తీసుకువస్తూ అధికారులకు చిక్కారు. రాంబాబు పోలీసులను గమనించి పరారయ్యాడు. మరో సంఘటనలో వేగంగా వస్తున్న కారును ఎస్​ఈబీ అధికారులు తనిఖీల కోసం ఆపగా.. ఆపకుండా వెళ్లిపోవటంపై అనుమానంతో వెంబడించారు. ఆ వాహనాన్ని నగరంలోని విజిలెన్స్​ కార్యాలయం వద్ద ఆపి.. అందులో ఉన్న వ్యక్తి పారిపోయాడు. అతడు తెలంగాణలోని పూల్లూరు గ్రామానికి చెందిన దిలీప్​గా గుర్తించారు. కారును తనిఖీ చేయగా 20 బాక్సుల్లో తెలంగాణ మద్యాన్ని గుర్తించారు. ఈ రెండు కేసుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి.. రెండు కార్లను సీజ్​ చేసినట్లు సెబ్​ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

60 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details