ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుప్రీంకు సైతం కులాన్ని ఆపాదిస్తారా' - సోమిశెట్టి వెంకటేశ్వర్లు తాజా న్యూస్

స్థానిక ఎన్నికల వాయిదాపై ఎస్ఈసీకి కులం అంటగట్టిన సీఎం జగన్... వాయిదాపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టుకు సైతం కులాన్ని అంటగడతారా అని తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

kurnool tdp somishett
'సుప్రీంకు సైతం కులాన్ని అంటగట్టేస్తాడేమోనని భయంగా ఉంది'

By

Published : Mar 18, 2020, 11:53 PM IST

'సుప్రీంకు సైతం కులాన్ని అంటగట్టేస్తాడేమోనని భయంగా ఉంది'

సుప్రీంకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలులో డిమాండ్ చేశారు. జగన్ తనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సైతం కులాన్ని అంటగడతారేమోనని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో జరిగిన హింసపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నామన్నారు. మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈసారి జరగనున్న ఎన్నికలను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కోరారు.

ఇవీ చూడండి-'వైకాపాపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బట్టబయలైంది'

ABOUT THE AUTHOR

...view details