కరోనా కట్టడి నేపథ్యంలో చేపట్టిన లాక్ డౌన్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఆదోనిలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఎన్టీఆర్, భీమస్, శ్రీనివాస్ భవన్ వంటి ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. అనవసరంగా రహదారిపైకి వచ్చిన యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నంద్యాలలోని పలు వీధులు, రహదారుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అనవసరంగా బయట తిరిగే వారికి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు పలువురు మజ్జిగ సరఫరా చేస్తున్నారు. ఉగాది రోజున ఆలయాలు మూసివేసినా... కొంతమంది ప్రజలు దేవాలయం బయట మొక్కుకొని వెళ్లారు.
కర్నూలులో...