ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి చేయాలి' - శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో.. జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

kurnool district collector veerapandyan conducted meeting on srisailam brahmaotsavalu
కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్

By

Published : Feb 11, 2021, 9:16 PM IST

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మార్చి 4 నుంచి 14 వరకు జరిగే... శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సమీక్ష నిర్వహించారు. సునయన ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో... జిల్లా, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

కొవిడ్-19 ను దృష్టిలో ఉంచుకొని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 11వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాన్యాస రుద్రాభిషేక లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, గ్రామోత్సవం, రథోత్సవం తదితర అన్ని ఉత్సవాలను సంప్రదాయం ప్రకారం, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details