కర్నూలు జిల్లాలో కరోనా విజృంభన కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం బాధితుల సంఖ్య 59,915కి చేరింది. ఇప్పటి వరకూ 59,156 మంది మహమ్మారిని జయించి సురక్షితంగా ఇళ్లకు చేరారు.
వివిధ ఆసుపత్రిల్లో 276 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ కారణంగా ఇవాళ ఒక్కరు కూడా మరణించలేదు. ఇప్పటి వరకు మహమ్మారితో 483 మంది మృతిచెందినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.